ఎల్లోమీడియా కథనం ప్రకారం చూస్తే అందరికీ ఇదే అనుమానం మొదలైంది. విషయం ఏమిటంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ తరపున పోటీచేయబోయే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఫైనల్ అయిపోయాయట. కర్నూలు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, డోన్, ఆళ్ళగడ్డ, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో టీడీపీయే పోటీచేయబోతోందట. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో జనసేనకు ఇచ్చేవి ఏవి, టీడీపీలో పోటీచేసేది ఎవరనే విషయాన్ని చంద్రబాబు ఇంకా డిసైడ్ చేయలేదని ఎల్లోమీడియా రాసింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియ, డోన్ లో కోట్ల కుటుంబానికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబ నిర్ణయించారు. ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియ చేసిన కంపు అంతా ఇంతా కాదు. ఆమె మీద కిడ్నాపు, భూకబ్జాలు, హత్యాయత్నాలు, ఫోర్జరి, బెదిరింపుల్లాంటి చాలా కేసులు నమోదయ్యాయి. పార్టీతో పాటు భూమాకుటుంబం కూడా అఖిలను దాదాపు వెలేసిందనే చెప్పాలి. అఖిలతో మాట్లాడటానికి చంద్రబాబు, లోకేష్ కూడా ఇష్టపడటంలేదు. పార్టీ మీటింగులకు కూడా ఆమెను పిలవటంలేదు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో భూమా అఖిలకే ఆళ్ళగడ్డలో టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించాంటే బెదిరింపులకు లొంగిపోయినట్లే అనుకోవాలి.
తనకు కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారో చూస్తానని అఖిల ఓపెన్ గానే చాలెంజ్ చేసింది. పోని అఖిల గెలుస్తుందా అంటే అదీ డౌటే. ఆమెను ఓడగొట్టాలని కాచుక్కూర్చున్న శతృవులు చాలామందున్నారు. ఈ విషయం తెలిసీ చంద్రబాబు మళ్ళీ అఖిలకే టికెట్ ఇవ్వబోతున్నారు. అలాగే డోన్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్ధితి. డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డిని అభ్యర్ధిగా చంద్రబాబు చాలాకాలం క్రితమే ప్రకటించారు.
ధర్మవరం కూడా నియోజకవర్గంలో తిరుగుతు చాలా డబ్బులు ఖర్చు చేసుకున్నారు. అయితే తమకు లేదా కోట్ల కుటుంటానికి మాత్రమే టికెట్ ఇవ్వాలని కాదు కూడదని ధర్మవరానికే ఇస్తే ఓడిస్తామని కేఈ ప్రతాప్ బహిరంగంగా చంద్రబాబును హెచ్చరించారు. ప్రతాప్ దెబ్బకు చంద్రబాబు భయపడిపోయి ధర్మవరంను పక్కనపెట్టేశారు. తాజాగా డోన్ లో కోట్ల కుటుంబానికి టికెట్ ఫైనల్ చేశారు. బహుశా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీచేయచ్చంటున్నారు. మొత్తానికి చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి ఆళ్ళగడ్డ, డోన్ టికెట్లను సాధించుకున్నట్లు అర్ధమైపోతోంది.