అల్లు అర్జున్ ఈ పర్సనాల్టీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఆర్మీయే ఉంది. తన మొదటి సినిమా నుంచి ఒక్కోమెట్టు ఎక్కుకుంటూ స్టైలిష్ స్టార్‌గా, ఐకాన్ స్టార్‌గా ఎదుగుతూ వచ్చిన అల్లు అర్జున్ (బన్నీ).. పుష్ప సినిమాతో ఓ రేంజ్‌కి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ.. నిన్న ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
నటుడు రావు రమేష్ లీడ్ రోల్‌లో వస్తున్న సినిమా `మారుతీ నగర్ సుబ్రమణ్యం`. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఈ సినిమాకు నిర్మాత. కాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బన్నీ మైక్ అందుకోగానే తన అభిమానులను ఉత్సాహపరిచే విధంగా ఐ లవ్ యూ మై ఆర్మీ అంటూ స్పీచ్ స్టార్ట్ చేశాడు. పుష్ప-2 సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్న సమయంలో తబిత వచ్చి మారుతీనగర్ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావాలని కోరారని, తాను వస్తానని మాటిచ్చి మరీ వచ్చానన్నారు. “మనకు ఇష్టమైన వారికి మన సపోర్ట్ చూపించాలి.. నాకు ఇష్టమైతే నేను వస్తా.. నా మనసుకు నచ్చితే వస్తా, అది మీ అందరికీ తెలిసిందే“ అంటూ బన్నీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఓ ఈవెంట్‌లో ఎప్పుడైతే ‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ఇచ్చాడో అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనూ అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు నంద్యాలకు వెళ్లారో అప్పుడీ గొడవ మరింత ముదిరి రచ్చకెక్కింది. పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడే అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టి తరువాత తొలగించేశాడు. ఇటీవల అల్లు అర్జున్ మామూలు వ్యక్తిలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను కూడా పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. తాజాగా బన్నీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మెగా వర్సెస్ అల్లు వార్ సోషల్ మీడియాలో మళ్లీ మొదలైంది.