మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ సీఎం జగన్‌పై రాళ్లతో దాడి జరిగింది. బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్తుండగా రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. ఈ దాడిలో ఓ రాయి జగన్ ఎడమ కనుబొమ్మకు తాకి గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైద్యులు జగన్‌కు బస్సులోనే ఫస్ట్ ఎయిడ్ చేశారు.
సీఎం జగన్‌పై క్యాట్‌బాల్‌తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు సీఎం జగన్. జగన్‌పై దాడి చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే దాడులు చేపిస్తున్నారని మండిపడుతున్నారు.