ఊహించిందే జరిగింది. వైసీపీకి బాలినేని శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. జగన్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొనడం విశేషం. ఆయన త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉంది.
బాలినేని లేఖలో ఏం రాశారంటే..?
“కొన్ని కారణాల రీత్యా వైసీపీ సభ్యత్వానికి రాజీనా చేస్తున్నాను. విలువలను నమ్ముకొనే దాదాపు ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా, రెండు సార్లు మంత్రిగా పనిచేశాను. ఆ తృప్తి నాకు ఉంది, కొంత గర్వంగా కూడా ఉంది. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు.. వైఎస్‌ఆర్ కుటుంబానికి సన్నిహితుడిని అయినా.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగా లేవు. నేను కచ్చితంగా అడ్డుకొన్నాను. ఎలాంటి మోహమాటాలకు పోలేదు. అంతిమంగా ప్రజా తీర్పును ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే. నేను ప్రజా నాయకుడిని. ప్రజల తీర్పే నాకు శిరోధార్యం. రాజకీయాల్లో భాష గౌరంగా హుందాగా ఉండాలని నమ్మే నిఖార్సైన రాజకీయం నేను చేశాను. కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకొనప్పుడు అన్ని విధాలా విలువలను కాపాడాల్సిన బాధ్యత మనదే.. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశాను అందరికీ ధన్యవాదాలు.”
జనసేన లోకి..
బాలినేని జనసేనలో చేరబోతున్నారు. నిన్న జనసేన కీలక నేత నాగబాబుతో మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా జగన్ తీరుపైపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని.. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందన్న అభిప్రాయంతో ఉన్నారు. అందుకే రాజీనామా చేశారు. రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారని అంటున్నారు. చేరిక ఎప్పుడనేది తేలాల్సి ఉంది.