YouTube channel subscription banner header

రామోజీ భూ దాహం.. వక్ఫ్ బోర్డు భూములు స్వాహా..

Published on

ఈనాడు రామోజీరావు భూబాగోతం ఒక్కటి వెలుగు చూసింది. ఇలా ఆయన ఎన్ని స్థలాలను కబ్జా చేశారో తెలియదు గానీ ఇది మాత్రం ఆయన భూకబ్జాల తీరుకు ఉదాహరణగా నిలుస్తోంది. మీడియాను అడ్డం పెట్టుకుని అక్రమాలు సాగిస్తున్న వైనానికి ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని రామోజీరావు తాపత్రయపడుతుంది కూడా ఇటువంటి అక్రమాలను నిర్లజ్జగా చేయడానికేనని చెప్పవచ్చు. కర్నూలు నగరంలో ముస్లిం మైనారిటీలకు చెందిన భూమిని కబ్జా చేసిన విషయం వెలుగు చూసింది. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పరిధిలో గల సర్వే నెంబర్ 80లో 4.68 ఎకరాల వక్ఫ్ భూమిని ఆయన ఆక్రమించారు. తన పలుకుబడిని వాడుకుని పత్రికను అడ్డం పెట్టుకుని ఆ విలువైన భూమిని కాజేశారు. వక్ఫ్ బోర్డు నోటీసులను, కోర్టులను కూడా బేఖాతరు చేస్తూ ఈ భూమి తనదేనంటూ ఓ బోర్డు తగిలించారు.

Latest articles

మళ్లీ తెరపైకి జెత్వానీ.. ఇద్దరు అధికారులపై వేటు!

సినీ నటి, మోడల్‌ జెత్వానీ కాదంబరి మళ్లీ తెరపైకి వచ్చారు. శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు మరోసారి ఫిర్యాదు...

వైసీపీలో యాంకర్‌ శ్యామలకు కీలకపదవి

ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యాంకర్ శ్యామల వైసీపీకి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ,...

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైడ్రా ఏర్పాటుకి సంబంధించిన జీవో 99 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ...

చంద్రబాబు టార్గెట్ వేరే.. ఆ దిశగానే అడుగులు

పాలనలో జగన్ పద్ధతి వేరు, చంద్రబాబు వ్యూహాలు వేరు అని స్పష్టంగా తేడా తెలుస్తోంది. నవరత్నాలపై ఫోకస్ పెట్టిన...