బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అనర్హత అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. లేదంటే రెండు రోజుల్లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఇంటికి చీరలు, గాజులు కొరియర్ చేస్తానని చెప్పారు. మగవాళ్లలా రాజకీయం చేయాలంటూ కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
https://x.com/TeluguScribe/status/1833799579709448249
అనర్హత అంశంపై కోర్టు తీర్పు రాగానే పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో వణుకు మొదలైందన్నారు కౌశిక్ రెడ్డి. ఒకరు కాంగ్రెస్‌లో చేరలేదని చెప్తుంటే, మరొకరు సుప్రీంకోర్టు బెంచ్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను మోసం చేసిన వారిని క్షమించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, ఉప ఎన్నికలు వస్తే 10 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే కే.పి.వివేకానందతో కలిసి అసెంబ్లీ సెక్రటరీని కలిశారు కౌశిక్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీని కోరారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత అంశంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది.