చెప్పుకోవడానికి ఏమీ లేక టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తన పార్టీ కార్యకర్తలను ఆయన మీదికి ఉసిగొల్పే విధంగా మాట్లాడుతున్నారు. ప్రతి సభలోనూ ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. తాను జగన్మోహన్ రెడ్డికి కొత్త పేరు పెట్టానంటూ జే.. గన్ రెడ్డి అని అన్నారు. రాజకీయాల్లో అందరికన్నా సీనియర్‌ను తానే అని చెప్పుకునే నాయకుడు ప్రత్యర్థి మీద నీచమైన వ్యాఖ్యలు చేయడమేమిటని విస్తుపోయే పరిస్థితి కల్పిస్తున్నారు.
ఆ దున్నపోతు మనిషిని ఒక రాయి తీసుకుని ఏది దొరికతే అది తీసుకుని కొట్టండి అని ఆ మధ్య ఆయన పిలుపునిచ్చారు. హింసను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ముఖ్యమంత్రిని దున్నపోతు అని సంబోధించడం చూస్తే ఆయన ఎంత నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారో అర్థమవుతోంది. గాజు గ్లాసు తీసుకుని పొడవాలంటూ ఆయన ఇటీవల ఓ సభలో అన్నారు. ఇది రెచ్చగొట్టే వ్యాఖ్య కాకపోతే మరేమిటని ప్రశ్నిస్తున్నారు. జగన్‌ను సైకో అని సంబోధిస్తున్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఎంతగా దిగజారిపోయారో తెలిసిపోతుంది. సభల్లో ఆయన హావభావాలు కూడా వెగటు పుట్టిస్తున్నాయి. తానేదో ఆవేశంతో మాట్లాడుతున్నట్లు అనిపించుకోవడానికి మితిమీరి నటిస్తున్నారు. జగన్ మీద కక్ష తప్ప చంద్రబాబులో మరోటి కనిపించడం లేదు.
చంద్రబాబు కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎన్నికల్లో హింసను ప్రేరేపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన రెచ్చగొట్టడం వల్లే రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతన్నట్లు కనిపిస్తోంది. పైగా, కొన్ని నియోజకవర్గాల్లో స్థానికేతరులను దించి దాడులు చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళగిరి నియోజవర్గంలో జరిగిన సంఘటనను అందుకు ఉదాహరణగా చెప్పుతున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని కుంచనపల్లిలో గురువారంనాడు ప్రచారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై దాడి జరిగింది.
బైక్‌లతో చుట్టుముట్టి, వైసీపీ నాయకుల చుట్టూ రింగులు తిరుగుతూ దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి మరణించాడు. ఇక్కడ దాడి చేసినవారు స్థానికేతరులనే మాట వినిపిస్తోంది. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గురువారం టీడీపీ కార్యకర్తలు రోడ్ షో చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు.
విజయవాడలో వైఎస్ జగన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ నాయకులే ఈ దాడికి కుట్ర చేసినట్లు బయటపడింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అడ్డమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.