టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యంతో ముంచెత్తారు. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి హామీలను తుంగలో తొక్కారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా మద్యం నియంత్రణ దిశగా చర్యలు చేపట్టారు. మద్యం విక్రయాలను నిరుత్సాహపరుస్తూ, దశలవారీగా మద్య నిషేధానికి అవసరమైన చర్యలతో ముందుకెళ్తున్నారు.