YouTube channel subscription banner header

బ్రాహ్మణిని కూడా రంగంలోకి దింపారుగా..!

Published on

వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు బాగానే కష్టపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలవకపోతే ప్రజలు పూర్తిగా తనను మర్చిపోతారేమో, ఇక తనకు, తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే విషయం స్పష్టంగా అర్థమైంది. అందుకే.. అలా జరగకూడదని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ మొత్తాన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకోవడం మొదలుపెట్టారు.

ఒకవైపు చంద్రబాబుకు మద్దతుగా ఆయన భార్య భువనేశ్వరి ఇప్పటికే రాష్ట్రంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అంటే డైరెక్టుగా ఆమె టీడీపీకి ఓట్లేసి గెలిపించమని ప్రజలను అడగలేదు. కాని ఆ అర్థం వచ్చేట్లుగానే జనాలతో మాట్లాడుతున్నారు. నిజం గెలవాలి అనే స్లోగన్‌తో కొందరి ఇళ్ళకు వెళుతున్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు జైలుకు వెళ్లిన‌ప్పుడు మ‌నోవేద‌న‌తో కొందరు చనిపోయారట. అలాంటి కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా రూ. 3 లక్షల ఆర్థిక సాయాన్నికూడా అందిస్తున్నారు.

ఈ సందర్భంగా భువ‌నేశ్వ‌రి మాట్లాడినపుడు టీడీపీ అధికారంలోకి రాగానే అది చేస్తాం..ఇది చేస్తామంటూ హామీలు గుప్పించేస్తున్నారు. ఆమె ఏ హోదాలో జనాలకు హామీలు ఇస్తున్నారో ఆమెకే తెలియాలి. మొత్తానికి టీడీపీ గెలుపున‌కు ఆమె ప్రచారం చేస్తున్నారని మాత్రం అర్థ‌మవుతోంది. ఇప్పుడు ఇదే పద్ధ‌తిలో నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ప్రచారంలోకి దిగేశారు. లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో బ్రాహ్మణి పర్యటించారు.

మంగళగిరిలో చేనేత సామాజికవర్గం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే అందుకనే చేనేత కార్మికులపై బ్రాహ్మణి(Nara Brahmani) దృష్టిపెట్టారు. మంగళగిరి చేనేతలకు ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తామని, పుట్టెడు దుఃఖంలో ఉన్న చేనేతల కుటుంబాలను అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చేశారు. చేనేతల కుట్టు కేంద్రాలు, మగ్గాల కేంద్రాలు తదితరాలను సందర్శించారు. ఇక్కడ విషయం ఏమిటంటే అధికారంలోకి రాగానే చేనేతల కుటుంబాల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. మరి 2014-19 మధ్య అధికారంలో ఉన్నపుడు ఏంచేశారు?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి ఏనాడూ జనాల కష్టాల గురించి ఆలోచించలేదు, నియోజకవ‌ర్గాల్లో తిరగలేదు. అధికారంలో ఉన్నపుడు ఏం చేయని వీళ్ళు రేపు అధికారంలోకి రాగానే అది చేస్తం ఇది చేస్తామని జనాలకు హామీలు ఇస్తున్నారు. చేనేతల అధునాతన మగ్గాలను, కుట్టు మిషన్ కేంద్రాలను, చేనేతలకు ఇస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలను బ్రాహ్మణి సందర్శించారని ఎల్లో మీడియానే రాసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేనేతల అభివృద్ధికి కుట్టు మిషన్ కేంద్రాలను, నైపుణ్య శిక్షణ కేంద్రాలను, అధునాతన మగ్గాలను ఏర్పాటు చేసినట్లే కదా. వైసీపీ ప్రభుత్వం చేనేతల అభివృద్దికి ఇంత చేస్తున్నప్పుడు ఇక టీడీపీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణి కొత్తగా చేయడానికి ఏముంటుందో..? మరి, బ్రహ్మణి ఇంత కష్టపడి చేస్తున్న ప్రచారం.. లోకేష్‌కి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...