టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఉన్న మతి చెడినట్లుంది. వృద్ధాప్యం వల్ల ఆయన ఆలోచనలు సానుకూలంగా సాగడం లేదని అనుకోవచ్చు. అంతేకాకుండా, అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారింది. అందులో భాగంగానే మెగా డీఎస్సీపై హామీ ఇచ్చినట్లు భావించవచ్చు. నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో ప్రజలకు ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాననే హామీ అందులో ఒకటి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుదీర్ఘమైన కసరత్తు చేసి డీఎస్సీని ప్రకటించారు. 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఏప్రిల్ 30వ తేదీలోగా పూర్తి చేసే విధంగా కొత్త షెడ్యూల్ కూడా వచ్చింది. ఎన్నికలకు ముందే డీఎస్సీ పరీక్షలు ముగుస్తాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి నియమకాల ప్రక్రియ సాగుతూ ఉంటుంది.
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ ఏ మాత్రం అర్థవంతం కాదు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా డీఎస్సీ పరీక్షలు పూర్తయి నియామకాల ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. చంద్రబాబు ఇచ్చిన హామీ కామెడీ కాకపోతే, మరేమిటి?
తాను ప్రజలకు ఇచ్చిన హామీలు చంద్రబాబుకు గుర్తుంటాయో, లేదో కూడా తెలియదు. హామీలు ఇచ్చి మోసం చేయడం ఆయన రక్తంలోనే ఉంది.