టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు అప్పుడే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరిచిపోయినట్లున్నారు. మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరాల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ప్రచార సభల్లో తాను ఇచ్చిన హామీల గురించి ఆయన చెప్పడం లేదు. తాను అధికారంలోకి వస్తే చేసే హామీల గురించి అసలు వివరించడం లేదు. తాను ఎన్ని హామీలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మరనే విషయం ఆయనకు అర్థమైనట్లు ఉంది.