ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం స్థానం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం దాదాపు ఖాయమైపోయిందంటున్నారు. అదే జరిగితే వసంతకు ఇక్కడ టీడీపీ టికెట్ ఇస్తారు. ఇది ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దేవినేని ఉమాకు ఎసరు పెట్టే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉమాను ఒప్పించి పెనమలూరుకు పంపాలని చంద్రబాబు లెక్కలేస్తున్నారు.