YouTube channel subscription banner header

పేదలకు పెన్షన్‌ ఆపిన పాపాత్ముడెవరు?

Published on

వయసు మళ్లిన ఒక పేదవాడికి నెలకు మూడు వేల రూపాయలు అందడం అంటే అది ఒక జీవితాన్ని నిలబెట్టడమే! అలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అనారోగ్యం బారినపడి, నాలుగు అడుగులు వేయలేనివారికి.. అంటే అలాంటి 66 లక్షల మందికి ప్రతి నెలా, ఒకటో తేదీనే మూడు వేలు అందే ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఎంత గొప్ప పని..!

ఆ పేదలంతా కట్టగట్టుకుని జగన్‌కి ఓటేస్తారేమోనని భయం పట్టుకుంది చంద్రబాబు ముఠాకి, జగన్‌ ఏర్పాటు చేసిన వలంటీర్లు – సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ పింఛన్లు క్రమం తప్పకుండా అందరికీ అందుతున్నాయి. దాంతో చంద్రబాబు తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. ఇది ఎన్నికల తరుణం గనక, అలా వలంటీర్లు, పేదలకు పెన్షన్‌లు పంచకూడదని తన సొంత మనిషి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయించారు. ‘అవును కదా, అలా చేయవద్దు’ అని కమిషన్‌ చెప్పింది. ఇప్పుడు వలంటీర్లు, అర్హులైన పేదల ఇళ్లకు వెళ్లి, పింఛన్‌ డబ్బు ఇవ్వడానికి వీల్లేదు. నడవలేని వాళ్లు, పండుటాకుల్లా వణుకుతున్నవాళ్లు, కొద్దిపాటి ఎండకి కూడా తట్టుకోలేనివాళ్లు.. మూడు వేల రూపాయల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బు కోసం పడిగాపులు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిత్య జీవన విషాదం.. ఎంత తీవ్ర పరిస్థితికి దారి తీసిందంటే, ఇప్పటికి 39 మంది పెద్దవాళ్లు చనిపోయారు. ముసలితనం, నీరసం, డబ్బు అందుతుందో లేదోనన్న ఆందోళనతో వాళ్లు మరణించారు. ఎంత దారుణం. ఈ పాపం ఎవరిది..? హాయిగా ఇళ్లలో మంచాల మీదే ఉండి, పింఛన్‌ అందుకుంటున్న వృద్ధుల‌కు నరకం చూపించి, ప్రాణాలు హరించిన పాపాత్ముడు ఎవరు..? నిస్సందేహంగా చంద్రబాబు నాయుడే.

ఎన్నికల్లో గెలవడమే ముఖ్యం గనక, ఎన్ని రాజకీయ ఎత్తుగడలన్నా వేయవచ్చు. కానీ, ప్రజల ప్రాణాలు తీసే నీచానికి పాల్పడటం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. 66 లక్షల మందికి నెలకి మూడేసి వేల రూపాయలు ఇవ్వడం అంటే, అది కోటాను కోట్ల డబ్బు. ప్రజలకు నిజమైన సేవ అంటే ఇదేగా..! సంక్షేమానికి సరైన అర్థమూ ఇదే కదా..! ప్రజలకు మేలు జరిగితే ఏమవుతుంది. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ముఠా ఓడిపోతుంది. జనం వాళ్లను తిరస్కరిస్తారు. ఆ భయంతోనే చంద్రబాబు నిరుపేదలకు డబ్బు చేరకుండా అడ్డుకున్నారు.

రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెయ్యవలసిన పనేనా ఇది..? అలా దీనంగా, నిస్సహాయంగా, ఆందోళనతో చనిపోయిన వాళ్ల ప్రాణాలకు విలువెంత..? వాళ్ల కుటుంబాల వేదనకీ, కన్నీళ్లకీ ఖరీదెంత..? ఈ నికృష్టమైన రాజకీయ క్రీడలో దిగజారిన చంద్రబాబు పరువెంత..? అతనికి వంత పాడుతున్న పవన్‌ కళ్యాణ్‌ నైతికత ఎంత..? ఈ దిగజారుడు రాజకీయాల ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం, కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమేగా..! ఎంత పతనం..!

వేల కోట్లు వెనకేసుకున్న చంద్రబాబు, దీనులకు, దిక్కులేనివాళ్లకు మూడు వేల రూపాయలు ఇవ్వడాన్ని అడ్డుకోవడం, దానివల్ల ఇప్పటికే 39 మంది చనిపోవడం, దేంతో పోల్చాలి..! భగవంతుడు అనేవాడు ఉంటే ఇలాంటి క్రూరులకు ఎలాంటి శిక్ష విధిస్తాడో…

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...