సభ్యత, సంస్కారం అనే పదాలకు తిలోదకాలు ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడతున్న చంద్రబాబు ఉచితానుచితాలు మరిచి జగన్ మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి సందర్బంలోనూ జగన్ను సైకో అంటూ సంబోధిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఎంత ఆగ్రహం, కసి ఉన్నప్పటికీ ఎవరు కూడా అటువంటి మాటలు అనరు. కానీ చంద్రబాబు అంటున్నారు.
‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చే హక్కు నీ తల్లి మొగుడు ఇచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా? మీ నానమ్మ మొగుడు ఇచ్చాడా?’’ అంటూ ఆయన ప్రశ్నలు వేశారు. 70 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తి, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, 40 ఏళ్లకు పైగా రాజకీయానుభవం ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ను అలా తిట్టడానికి చంద్రబాబుకు తనకు చెందిన ఎవరి మొగుడు హక్కు ఇచ్చారో..
చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే రాజకీయాలు ఎంత పతనావస్థకు చేరుకున్నాయో అర్థమవుతోంది. చంద్రబాబు పూర్తిగా దిగజారారని ఎవరికైనా అనిపించకమానదు. చంద్రబాబు నోరు కంపు వాసన కొడుతోంది. తాను ఎన్ని చేసినా జగన్ను ఓడించలేమనే ఉద్దేశంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి, అవాంఛనీయ సంఘటనలు జరిగేలా కుట్ర చేసి జగన్ మీద నింద వేయడానికి చూస్తున్నట్లు అనుకోవాలి.
నిజానికి, భూ హక్కు చట్టానికి టీడీపీ తొలుత మద్దతు పలికింది. ఈ చట్టాన్ని సాహసోపేతమైన చర్యగా పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుని ప్రజలను భయాందోళనలకు గురి చేయాలని కుట్ర చేశారు. అందుకే, ఆ చట్టం గురించి సమయమూ సందర్భం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు.
జగన్ మాత్రం తన ప్రచారంలో హుందాగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబును ఒక్క పొల్లు మాట అనడం లేదు. మోసగాడు అని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తాడని మాత్రమే జగన్ అంటున్నారు. చంద్రబాబు మరో రెండు మూడు రోజుల్లో మరింతగా దిగజారి వ్యాఖ్యలు చేయడని అనుకోవడానికి ఏమీ లేదు.