అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన అన్యాయాలు, దారుణాలు అన్నీ ఇన్నీ కావు. చేసిన నేరాలకు ఏదో ఒక రోజు శిక్షపడటం ఖాయం. దానిలో భాగంగానే ఇప్పుడు బాబు మెడకు ఓ ఉచ్చు చుట్టుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) కుంభకోణంలో సీఐడీ దూకుడు పెంచింది. కుంభకోణానికి బాధ్యులను చేస్తూ చంద్రబాబు అండ్ కో పై ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీటు దాఖలు చేసింది.
త్వరలో ఎన్నికలు ఉండగా.. అందులోనూ చంద్రబాబు ఎన్డీయేలో చేరబోతున్న సమయంలో సీఐడీ చార్జిషీటు దాఖలు చేయటం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు 53 రోజులు రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. అనేక కేసులు వివిధ కోర్టుల్లో నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సడెన్‌గా ఐఆర్ఆర్ కుంభకోణంలో చంద్రబాబును ఏ1గా, మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఏ2గా, ఏ3గా లింగమనేని రమేష్, ఏ 14గా లోకేష్‌ను సీఐడీ ప్రస్తావించింది. చార్జిషీట్ దాఖలు చేయటంతో మళ్ళీ చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి.
కాగా.. లింగమనేని రమేష్ భూములకు లబ్ధి చేకూర్చేందుకే రాజధాని పరిధిలోని భూముల అలైన్మెంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం మూడు సార్లు మార్చిందని సీఐడీ ఆరోపిస్తోంది. రింగ్ రోడ్డు నిర్మాణం జరగకపోయినా జరుగుతున్నట్లు మాస్టర్ ప్లాన్ ప్రకటనతో చంద్రబాబు ప్రభుత్వం జనాలను నమ్మించిందని సీఐడీ ఆరోపించింది. దాంతో కొందరి భూములకు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. తమకు కావాల్సిన వాళ్ళ భూముల ధరలు పెరిగిపోవటం కోసమే మూడుసార్లు అలైన్మెంట్లను మార్చిందన్నది సీఐడీ అభియోగం. దీని ఫలితంగా అమ్ముకోదలచుకున్న వాళ్ళు భూములకు అత్యధిక ధరలకు అమ్ముకున్నారు. అలాగే కొనదలచుకున్న వాళ్ళు అతి తక్కువ ధరలకు భూములను కొన్నారు. తక్కువ ధరలకు భూములను తమవాళ్ళు కొనేయగానే మళ్ళీ అలైన్మెంట్లను మార్చటంతో అవే భూముల ధరలకు రెక్కలు వచ్చేట్లు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసిందట.
ఈ విధంగా లింగమనేని భూములకు దగ్గరలో ఔటర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ఆగిపోయింది. దాంతో లింగమనేని వందలాది ఎకరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. క్విడ్ ప్రో కో పద్ధతిలో లింగమనేని భూముల ధరలు పెంచేందుకు సహకరించినందుకు హెరిటేజ్‌కు 14 ఎకరాలను లింగమనేని ఇచ్చారని టాక్. అలాగే కరకట్ట మీద నిర్మించిన అక్రమ భవనాన్ని కూడా చంద్రబాబుకు కానుకగా ఇచ్చారన్నది సీఐడీ ఆరోపణ. అలైన్మెంట్ మార్చటంలో కీలకపాత్ర పోషించిన, లబ్ది పొందిన పొంగూరు నారాయణ, లింగమనేని, లోకేష్ తదితరులపై చార్జిషీట్ దాఖలు చేసింది. మరి సీఐడీ ఉచ్చు నుంచి చంద్రబాబు తప్పించుకుంటాడా లేక.. మళ్లీ జైలుకు వెళ్తాడో చూడాలి.