తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఎవరూ ఉండరని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లోకి క్యూ కడతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్లో కేవలం ఆ నలుగురు మాత్రమే మిగులుతారన్నారు. అనవసరంగా మాతో గోక్కోవద్దంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. తనతో పెట్టుకున్నవాళ్లేవరూ ఇంతవరకు బాగు పడలేదన్నారు.
మణుగూరు సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి…బీఆర్ఎస్ అంటేనే బిల్లా రంగా సమితి అంటూ విమర్శించారు. ప్రజా పాలనలో ప్రజలకు మంచి జరుగుతుంటే KCR ఫ్యామిలీ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని.. అవగాహనతోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయని ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు.