ప్రొఫెసర్ కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంపై గవర్నర్తో తాను స్వయంగా చర్చిస్తానన్నారు. కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే కౌన్సిల్ గౌరవం ఇనుమడిస్తుందన్నారు.
కేసీఆర్ తనను తాను తెలంగాణ బాపుగా చెప్పుకుంటున్నారని, ఆయనను బాపుతో పోల్చకూడదన్నారు. నిజానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్ అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉంచాలని ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా రేవంత్ ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రోఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకం చెల్లదని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ఎవరినీ సిఫార్సు చేస్తుందనేది ఆసక్తిగా మారింది.