YouTube channel subscription banner header

ఏపీలో గణేష్‌ మండపాలకు ఛార్జీలు.. కూటమి ప్ర‌భుత్వంపై విమర్శలు

Published on

ఏపీలో కూటమి సర్కార్‌ తీరు చర్చనీయాంశంగా మారింది. గణేష్‌ మండపాలు ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మీ సేవా కేంద్రాల్లో డబ్బులు కట్టి NOC తీసుకోవాలన్న నిబంధన తెచ్చింది. మండపాలు ఏర్పాటు చేయాలంటే సింగిల్‌ విండో విధానంలో అనుమతి తప్పనిసరి చేసింది. వినాయక విగ్రహం ఎత్తును బట్టి ధరలు నిర్ణయించింది. మైక్ ఏర్పాటు చేసుకోవాలన్న రుసుము చెల్లించాలనే ష‌ర‌తు విధించింది. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

https://x.com/UttarandhraNow/status/1832106782816399421

హోంమంత్రి వంగలపూడి అనిత ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. వినాయక విగ్రహం 3 నుంచి 6 అడుగులు ఉంటే రూ.350, ఆరు అడుగులు దాటితే రోజుకు రూ.700 వందల చొప్పున కట్టి మీ సేవా కేంద్రాల్లో చలాన్లు తీసుకోవాలని సూచించారు. ఎకో ఫ్రెండ్లీ విగ్రహం ఏర్పాటు చేసినా డబ్బు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అంతే కాదు మైక్ పర్మిషన్‌కు సైతం రూ.100 వసూలు చేస్తున్నారు.

గణేష్‌ మండపాలకు అనుమతి పేరుతో ప్రభుత్వం డబ్బులు దండుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంపద సృష్టించడం అంటే ఇదేనా అంటూ సెటైర్లు పేలుతున్నాయి. గతంలో జగన్‌ ఏ పని చేసినా తెలుగుదేశం పార్టీ ఆయనపై క్రిస్టియన్‌ ముద్ర వేసేది. చివరకు చెత్త నిర్వహణ కోసం కేవలం రూ.50 వసూలు చేసినా గగ్గోలు పెట్టింది. ఐతే ఇప్పుడు మాత్రం గణేష్‌ మండపాల నిర్వాహకుల నుంచి కూటమి ప్రభుత్వం నిలువుదోపిడీకి పాల్పడుతోందన్న విమర్శలు ఉన్నాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...