YouTube channel subscription banner header

మార్గదర్శి పని ముగిసినట్లేనా..?

Published on

మీడియాని అడ్డుపెట్టుకొని రామోజీరావు(Ramoji rao) చాలా వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఆ వ్యాపారాల్లో మోసాలు చేస్తున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఏ వ్యాపారాన్ని తీసుకున్నా చట్ట ఉల్లంఘనలు, అక్రమాలే ఉంటాయని మంత్రులు కూడా చాలాసార్లు ఆరోపించారు.

ఇప్పుడిదంతా ఎందుకంటే మార్గదర్శి(Margadarsi)చిట్ ఫండ్స్ సంస్థ‌ మోసాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) లాయర్ ఈ విషయంపై మాట్లాడారు. విచారణలో ఆర్బీఐ లాయర్లు ఎన్నిసార్లు పాల్గొన్నా పెద్దగా మాట్లాడింది లేదు. అయితే తాజాగా జరిగిన విచారణలో ఆర్బీఐ లాయర్ మాట్లాడుతూ.. హెచ్‌యూఎఫ్‌(హిందు అవిభాజ్య కుటుంబం) పేరుతో డిపాజిట్లు సేకరించటం చట్ట విరుద్ధమని స్పష్టంగా చెప్పారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌ పేరుతో డిపాజిట్లు సేకరించకూడదన్నారు.

అంటే మార్గదర్శి చైర్మన్ హోదాలో రామోజీరావు, ఎండీ హోదాలో కోడలు శైలజ దశాబ్దాలుగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తుకుంటున్నారు. మార్గదర్శి చిట్స్ గురించి కేంద్ర ప్రభుత్వం అడిగితే తనకు కేంద్ర చట్టాలు వర్తించవని చెబుతారట. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే తాను రాష్ట్ర ప్రభుత్వం చట్టాల ప్రకారం వ్యాపారం చేయటంలేదని చెబుతారని ఉండవల్లి చాలాసార్లు చెప్పారు. ఏ చట్టమూ వర్తించకపోతే ఏ చట్టం ప్రకారం మార్గదర్శి చిట్స్ వ్యాపారం చేస్తున్నారో రామోజీయే చెప్పాలని ఉండవల్లి చాలాసార్లు డిమాండ్ చేశారు.

ఉండవల్లి ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా రామోజీ మోసాలు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు విచారణలోనే బయటపడిందట. కాకపోతే విచారణను పూర్తిచేసి తీర్పు చెప్పటం ఒకటే మిగిలిందని ఆయన అన్నారు. అదృశ్య శక్తి ద్వారా విచారణ పూర్తికాకుండా రామోజీ అడ్డుకుంటున్నట్లు కూడా ఉండవల్లి ఆరోపించారు. తాజాగా ఆర్బీఐ లాయర్ చెప్పిన విషయంతో మార్గదర్శి వ్యాపారమంతా మోసాలే అని అర్థ‌మవుతోందని ఉండవల్లి మ‌రోసారి చెప్పారు. ప్రభుత్వ లాయర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. చట్ట విరుద్ధంగా ప్రజల నుండి రామోజీరావు రూ.4600 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. విచారణను ఏప్రిల్ 9వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆ రోజుతో రామోజీ బండారం మొత్తం బయటపడనుంది. మరి దాని నుంచి తప్పించుకోవడానికి ఆయన ఎన్ని కుట్రలు చేస్తారో చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...