చదువుతోనే వ్యక్తిగత అభివృద్ధి. చదువుతోనే రాష్ట్రం అభివృద్ధి. చదువుతోనే దేశం అభివృద్ధి. ఈ మాటలను అక్షరాలా నమ్మి.. అత్యద్భుతంగా అమలు చేసిన, చేస్తున్న నాయకులు.. దేశంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అది కూడా.. కులమతాలకు అతీతంగా.. వర్గభేదాలు రానీయకుండా.. నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ.. అర్హత కలిగిన అందరికీ.. విద్యను అందజేసిన నాయకులు మాత్రం చేతి వేళ్లపై లెక్కబెట్టగలినంతవారే తప్ప.. ఎక్కువగా లేరు. అలాంటివారిలో.. 20 ఏళ్ల క్రితం ఫీజు రీయింబర్స్ మెంట్తో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే.. ఇప్పుడు కేవలం విద్యారంగంపైనే 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పాలిట వర ప్రదాయినిగా నిలిచారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఒక్కసారి ఈ విద్యా సంస్కరణలు చూడండి..!
ఒకటి కాదు.. రెండు కాదు.. పదులు కాదు.. వందలు కాదు. వేల కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేసి.. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు రాజమార్గం వేశారు వైఎస్ జగన్. ఇది వాస్తవం అన్న విషయాన్ని అధికారిక గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు జరిగిన విద్యారంగ సంస్కరణలపై.. విమర్శకులు చేస్తున్న వ్యాఖ్యలకు చెంపపెట్టులాంటి ఫలితాలను ఈ సంస్కరణలు అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారాన్ని అందించాలన్న సంకల్పంతో.. వైఎస్సార్ సంపూర్ణ పథకం అమలుతో 6 వేల 141 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు జగన్. నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు అమ్మ ఒడి పథకంతో.. 26 వేల 349 కోట్ల రూపాయలు.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగు పరిచేందుకు నాడు – నేడు పథకంతో రూ.17 వేల 805 కోట్లు.. వసతి దీవెన పథకంతో రూ.6 వేల 275 కోట్లు.. గోరుముద్ద పథకంతో రూ.6, 262 కోట్లు.. విదేశీ విద్యా దీవెనకు రూ.132 కోట్లు.. ఇలా విభిన్న పథకాలు అమలు చేసి ప్రభుత్వ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పెద్దన్నలా ఆపన్నహస్తం అందించారు జగన్.
విద్యారంగంలోనే సంచలనం
ఇంత చేసినా.. ఇంకా ఏదో చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయమే.. ట్యాబ్ ల పంపిణీ. ఎన్ని పథకాలకు ఎన్ని వందల, వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఖర్చు చేసినా.. విద్యలో నాణ్యత పెంచాలి, తద్వారా విద్యార్థుల మేధస్సు పెరగాలి, అంతిమంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం.. ప్రపంచానికే పోటీనివ్వాలి అంటే.. విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు జగన్. అదేదో ఆశామాషీగా కాకుండా.. వాటిల్లో సీబీఎస్సీ సిలబస్ పాఠ్యాంశాలను అందుబాటులో ఉండేలా చూశారు. ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంలుగా మార్చారు కదా.. మరి ట్యాబుల్లో కేవలం ఇంగ్లిష్ లోనే పాఠాలు ఉంటాయా అంటూ విమర్శకులు చేసిన చిల్లర వ్యాఖ్యలకు.. ఇంగ్లిష్ లో మాత్రమే కాదు.. తెలుగుతో కలిపి మొత్తంగా 8 భాషల్లో పాఠ్యాంశాలను ఆ ట్యాబ్ ల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రముఖ విద్యా కంటెంట్ సంస్థ బైజూస్ తో ఒప్పందం చేసుకుని అంతర్జాతీయ స్థాయి పాఠ్యాంశాలను అతి సులభంగా విద్యార్థులకు అందజేయగలిగారు. ఈ పథకం అమలుకు ఏకంగా 686 కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. నిరుపేదల ఇళ్లల్లోకి కార్పొరేట్ చదువులను చేర్చగలిగారు.
ఒక్కో పేద విద్యార్థికి అందిన ప్రయోజనం ఎంతంటే..
ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. ఒక్కో ట్యాబ్ విలువ మార్కెట్ లో కనీసం 17 వేల రూపాయల పైనే ఉంది. వీటిల్లో పొందుపరిచే బైజూస్ కంటెంట్ విలువ ఒక్కో ట్యాబ్ కు కనీసం 15 వేల రూపాయల పైనే ఉంది. మొత్తంగా ట్యాబ్ ధర, బైజూస్ కంటెంట్ ధర కలిపితే.. ఒక్కో విద్యార్థికి కనీసం 33 వేల రూపాయల ప్రయోజనం నేరుగా అందింది. ఇంతటి టెక్నాలజీని చిన్న పిల్లల చేతుల్లోకి తీసుకువచ్చారు కదా.. మరి వాటిని అందుకున్న పిల్లలు ఇంటర్ నెట్ కారణంగా పక్కదారి పట్టే అవకాశం లేదా.. అంటూ కొందరు ఈ పథకంపై విమర్శలు చేయాలని చూసినా.. జగన్ ముందు చూపు ముందు అవేవీ పనిచేయకుండా పోయాయి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అందిన ప్రతి ట్యాబ్ లో.. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేశారు. విద్యకు సంబంధించి మినహా.. ఇతర ఏ అనవసరమైన, అసంబద్ధమైన విషయాలు ఆన్ లైన్ ద్వారా పిల్లల చేతుల్లోకి, వారి మెదళ్లలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. మూడేళ్ల పాటు ట్యాబ్ కు గ్యారంటీ అందించి.. ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురుకాకుండా చూశారు.ఇలా.. ట్యాబ్ ల పంపిణీతో నిరుపేద విద్యార్థులు, బీసీ, ఎస్సీ ఎస్టీ వర్గాలవారు.. మరీ ముఖ్యంగా మైనారిటీలకు జీవితకాలం మేలు చేశారు వైఎస్ జగన్.
అందుకున్నవారికే కాదు.. తోబుట్టువులకూ ప్రయోజనం.. ఎలాగంటే..!
కూలీనాలీ చేసుకునే బతుకులు.. నిరుపేదలు.. అణగారిన వర్గాలు.. అభివృద్ధికి నోచుకోని మైనారిటీ వర్గాలు. ఇలాంటి వారే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారు. అందులో ముస్లిం మైనారిటీ వర్గాల వంటి వారైతే.. ఇప్పుడిప్పుడే విద్యావకాశాలు అందుకుంటూ తమ భవిష్యత్తును మార్చుకుంటున్నారు. ఇలాంటి విద్యార్థులు మొత్తంగా 4 లక్షల 34 వేల మందికి పైగానే.. ట్యాబ్ ల పథకంతో లబ్ధి పొందారు. ఆ చిన్నారులంతా.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో తమ తోబుట్టువులకు కూడా అందులోని విద్యను అందించారు. వారిని కూడా చదువులో ముందుండేలా చూడగలిగారు. ఫలితంగా.. పరోక్షంగా సుమారు 10 లక్షల మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ట్యాబ్ లు, అందులోని బైజూస్ కంటెంట్ తో విద్యావంతులుగా ఎదుగుతున్నారు. రానున్న దశాబ్దకాలంలో ప్రపంచానికి వీరంతా తమ మేధస్సును అందించేందుకు ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటున్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలకు నోచుకోని పేదలు.. ఇంతటి ఉన్నత విద్యను అందుకున్నది మాత్రం కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లోనే.. అది కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే అని కచ్చితంగా చెప్పవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ కోటను తాకేంతటి ఆత్మస్థైర్యాన్ని అందించి.. చదువులో చిన్నారులను అగ్రగామిగా నిలబెట్టేలా చేసిన నాయకుడు కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అంతకుమించిన విశ్వాసంతో చెప్పవచ్చు. చివరగా.. ఎవరెన్ని మాటలన్నా, ఎవరెంత రాజకీయ విమర్శలు చేసినా.. ఒక్కటి మాత్రం నిజం. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీతో పాటు మరెందరో మహానుభావులు ఎంతో కాలం కొట్లాడితేనే మనం ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నాం. అభివృద్ధి ఫలాలు అందుకోగలుగుతున్నాం. అలాగే.. గాంధీ అడుగుజాడల్లో మన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు చిన్నారులకు విద్యా స్వాతంత్య్రాన్ని అందించేందుకు ట్యాబ్ స్కీమ్ తో నడుం కట్టారు. సుమారు 2 దశాబ్దాల క్రితం నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సృష్టించిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్ కు మానసపుత్రికగా వచ్చిన ట్యాబ్ స్కీమ్.. రానున్న ఐదారేళ్లలో అద్భుత ఫలితాలు సాధించడం ఖాయం. అవినీతికి అవకాశం లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ వర్తింపజేసేలా.. వందల కోట్లు ఖర్చు చేసి అమలు చేస్తున్న ఈ పథకం.. అతి త్వరలో విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ స్థాయిని ప్రపంచ పటంలో నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ఆర్ ను మించిన ముందు చూపుతో అమల్లోకి తీసుకొచ్చిన ఈ స్కీమ్.. జగన్ పరిపాలన పరిణతికి నిదర్శనంగా నిలుస్తుందనడంలో అతియోశక్తి కూడా లేదు.