YouTube channel subscription banner header

మరీ ఇంత సంస్కారహీనుడా?

Published on

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై ప‌దే ప‌దే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ త‌న‌లోని కుసంస్కారాన్ని బ‌య‌ట‌పెట్టుకుంటున్నాడు. ఇలా నోటీ దూల‌తో బాబు చేసిన‌ వ్యాఖ్యలపై ఈసీ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఎన్నిక‌ల అధికారులు హెచ్చ‌రించినా ఆయ‌న బుద్ధి మార‌లేదు. అదే మాట తీరుతో తన కులగజ్జిని బయట పెట్టుకుంటున్నారు. సంక్షేమ పాల‌న‌తో పేద‌ల‌కు మేలు చేస్తున్న జ‌గ‌న్‌ను సైకోగా అభివ‌ర్ణిస్తూ క‌డుపు మంట‌ను బ‌య‌ట‌పెట్టుకున్నాడు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని టీడీపీ ఉల్లంఘిస్తోందని తాజాగా ఏపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వాడిన భాషపై ఈసీ నోటీసులు జారీ చేసినప్పటికీ పద్ధతి మార్చుకోలేదని ఆయన అన్నారు. ‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనే శీర్షికతో టీడీపీ రూపొందించిన పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ఆ పాటను ఐ-టీడీపీ వెబ్ సైట్లో పదే పదే ప్లే చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆ పాటలో కులం, మతం ప్రస్తావన కూడా తెచ్చార‌ని వెల్ల‌డించారు.

కేవలం ఆ పాట మాత్రమే కాకుండా.. సీమ చెల్లమ్మ అనే పాట కూడా వైఎస్ జగన్‌ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందంటూ ఈ సందర్భంగా మల్లాది విష్ణు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...