YouTube channel subscription banner header

ఐదోసారి కూడా అత‌నే..

Published on

వరుసగా నాలుగు సార్లు గెలిచి రాయచోటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాన‌ని, చేసిన అభివృద్దే గెలిపిస్తుందని, ప్రజలే నన్ను గెలిపించుకుని ఐదోసారి అసెంబ్లీకి పంపిస్తారని అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.

గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు, దీనికి తోడు యువకుడిగా ఉన్నప్పటి నుండే తండ్రి గడికోట రామసుబ్బారెడ్డితో పాటు ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ, అందిరినీ ఆప్యాయంగా ఇంట్లో మనిషిలా పలకరిస్తూ కలిసిపోతుంటాడు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా అదే ఆప్యాయతతో అన్ని వర్గాలకూ చేదోడు వాదోడుగా ఉండటంతో ప్రజలు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ మీద బాగా పట్టు ఉండ‌టం, ఏ విషయం మీదైనా అవలీలగా మాట్లాడటం, నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడంలో విజయం సాధించడం, ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించడానికి రూ.100 కోట్లతో రిజర్వాయర్ ఏర్పాటు చేయడం వంటి పనులతో శ్రీకాంత్ రెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.

ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి సమస్య ఎక్కడుంటే శ్రీకాంత్ రెడ్డి అక్కడ ఉంటూ, ప్రజల్లో కలిసిపోతూ, వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నారు. జ‌గ‌న్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సహకారంతో నియోజకవర్గంలో సంక్షేమ పథ‌కాలకు, అభివృద్ధి పనులకూ ప్రత్యేక నిధులు తీసుకురావడమే కాకుండా, రాయచోటిని ప్రత్యేక జిల్లా చేయడం ద్వారా మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తూ నియోజకవర్గాన్నిఅభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు.

రాయచోటి అని చెబితే మొదటిగా గుర్తొచ్చేపేరు గడికోట శ్రీకాంత్ రెడ్డి అంతలా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్నితన పనితనంతో శ్రీకాంత్ రెడ్డి అడ్డాగా మార్చేశారు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, వరుసగా నాలుగు సార్లు గెలిచి తన సత్తా చాటారు. జ‌గ‌న్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు దక్కించుకున్న శ్రీకాంత్ రెడ్డి ఐదోసారి కూడా గెలిపించేందుకు రాయ‌చోటి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు.

2019లో తొలిసారి రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి జ‌గ‌న్ వెన్నంటే ఉండి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాటి నుండి వరుసగా 2014, 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. అన్నివర్గాలతోనూ ముఖ్యంగా నియోజకవర్గంలో అధిక సంఖ్యాకులైన బలిజ సామాజిక వర్గానికి సైతం శ్రీకాంత్ రెడ్డి మా బిడ్డే అనేంతగా ఆప్యాయంగా ఉంటూ అందరివాడుగా కలిసిపోతూ, ఎమ్మెల్యే అంటే శ్రీకాంత్ రెడ్డి , రెండో వ్యక్తికి మా హృదయాల్లో స్థానం లేదు అనేలా నిలిచిపోయారు.

రాయలసీమలో పులివెందుల తరువాత రాయచోటి జగన్‌కు కంచుకోట. అందుకే ముందు శ్రీకాంత్ రెడ్డిని ఓడిస్తే జగన్‌ను సగం ఓడించినట్లే అని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. శ్రీకాంత్ రెడ్డిని ఓడించడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అయితే టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను గట్టిగానే తిప్పికొడుతున్నారు జనాలు. రాయచోటి అంటేనే శ్రీకాంత్ రెడ్డి అని రెండో వ్యక్తిని ఎమ్మెల్యేగా ఉహించుకోలేమని టీడీపీ నేత‌ల ముఖం మీదే చెబుతున్నారు. దీనికి తోడు టీడీపీలో అంతర్గత విభేదాలు, ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంక గడికోట శ్రీకాంత్ రెడ్డికి ప్ర‌త్య‌ర్థిగా పోటీ చేస్తున్నటీడీపీ నేత మండిపల్లి రాం ప్ర‌సాద్‌రెడ్డికి పార్టీ నేతలే సహకరించకపోవడం, నియోజక వర్గంలో మైనార్టీ వర్గం సైతం శ్రీకాంత్ రెడ్డి వెంటే ఉండటం టీడీపీకి కోలుకోలేని దెబ్బ. అంతేకాకుండా రాయచోటి కొత్త జిల్లా అయ్యాక అభివృద్ధిలో దూసుకుపోతుంటంతో శ్రీకాంత్ రెడ్డి ఓడిపోతే నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోతుందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే శ్రీకాంత్ రెడ్డిని ఐదోసారి కూడా గెలిపించుకుంటామ‌ని రాయచోటి ప్ర‌జ‌లు ధీమాగా చెబుతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...