ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రశంసలు కురిపించారు. మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పారు. గతంలోనూ సీఎం జగన్‌పై ఇలాంటి దాడులు జరిగాయన్నారు విశాల్. అయితే ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని అన్నారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని.. కానీ సీఎం జగన్‌కు తను విపరీతమైన అభిమానమని తెలిపారు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశాల్ “రత్నం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదారాబాద్ వచ్చిన విశాల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని విశాల్ అన్నారు.