బంగ్లాదేశ్‌తో ఆడబోయే టెస్ట్ సిరీస్‌కి భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. సెప్టెంబరు 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. రోడ్డు ప్రమాదానికి గురై కొన్ని నెలల క్రితం రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఈ సిరీస్‌తో తిరిగి టెస్టుల్లోకి అడుగుపెట్టనున్నాడు. మరోపక్క దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన పేసర్ యశ్ దయాళ్ తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు.
ఇక ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ తమ స్థానాలను కాపాడుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా–ఏ తరఫున ఆడుతున్న ఆకాశ్.. ఇండియా–బిపై తొలి ఇన్నింగ్స్‌లో (4/60), రెండో ఇన్నింగ్స్‌లో (5/56)తో అదరగొట్టాడు. చెన్నై వేదికగా సెప్టెంబరు 19–23 మధ్య తొలి టెస్టు, సెప్టెంబరు 27 – అక్టోబర్ 1 మధ్య కాన్పూర్ వేదికగా రెండో టెస్టు జరగనున్నాయి.
బంగ్లాతో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్.