చంద్రబాబుది అంతా మేకపోతు గాంభీర్యమే. ఏదీ చెయ్యకపోయినా అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ నానా హడావిడి చేస్తాడు. ఆయన చెప్పేదంతా ప్రచారం వరకే ఆగిపోతుంది. ఆయన హయాంలో ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో తెగ ప్రచారం చేశారు. కానీ.. అది ప్రచారం దగ్గరే ఆగిపోయింది. దాంతో స్టార్టప్‌ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు(startups) ఉండగా, అవి ప్రస్తుతం 586కి పెరిగాయి. స్టార్టప్‌ల సంఖ్య దాదాపు మూడింతలు పెరిగడం విశేషం.
వైఎస్ జగన్ ప్రభుత్వం స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్‌షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ4కి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పలు స్టార్టప్‌లు తయారవుతున్నాయి. చంద్రబాబులా ప్రచారాలకే పరిమితం కాకుండా… స్టార్టప్స్ కంపెనీలకు జగన్ అండగా నిలుస్తున్నారు. ఆయన ప్రోద్బలంతో మరిన్ని స్టార్టప్స్ అంకురించడానికి సిద్ధమౌతున్నాయి.