వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. మరో 25 మంది ఎమ్మెల్యేల స్థానాలు మార్చారు. దీని వల్ల దాదాపు 12 మంది పార్టీకి రాజీనామా చేశారు. అయినప్పటికీ పెద్దగా తిరుగుబాటు కనిపించలేదు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మాత్రం తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సీట్ల పంపకం, కేటాయింపులు సరిగా జరగలేదు. ఏ సీటు ఏ పార్టీకి దక్కుతుందో, ఏ సీటుకు ఏ అభ్యర్థిని ఎంపిక చేస్తారో తెలియక తీవ్రమైన అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి