గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగానికి చాలినంత విద్యుత్ అందించడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా వైఫల్యం చెందారు. ‘క్రాప్ హాలీడే’లు ప్రకటించి రైతుల జీవితాలతో చెలగాటమాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసిన జగన్.. రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు.