వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మేమంతా సిద్ధమే అంటూ బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఈ బస్సు యాత్ర ఎనిమిది రోజులు పూర్తి చేసుకుంది. తిరుపతి సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమేనని వెల్లడించారు. గత ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు కూటమితో ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగారని వెల్లడించారు.
ఇలా కూటమిగా ఏర్పడి చంద్రబాబు చేసే దొంగ హామీలను ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. ఆయన గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చంద్రబాబుని తిరుపతి సభా వేదికగా జగన్మోహన్ రెడ్డి విమర్మించారు. ఇకపోతే నిమ్మగడ్డ రమేష్ సహాయంతో వలంటీర్ల సేవలను బాబు నిలిపివేశారని, పెన్షన్ల కోసం అవ్వ తాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తిరిగి అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమేనని, మన ప్రభుత్వం రాగానే వలంటీర్ సేవలను తిరిగి కొనసాగిస్తానని, వాళ్లే అవ్వాతాతలకు పెన్షన్ అందజేస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆయన తొలి సంతకం వలంటీర్ల కోసమే చేసేలా ఉన్నారని తెలుస్తోంది. ఎప్పటిలాగే ఈ సభ వేదికగా గత ఎన్నికల సమయంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోని చూపిస్తూ ఇందులో ఒకటైన అమలు చేశారా అంటూ ప్రశ్నించారు.