YouTube channel subscription banner header

ఈరోజు పొలిటికల్ ట్రెండింగ్: నాలుక కోస్తా

Published on

తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో రోజుకో డైలాగ్ ఫేమస్ అవుతోంది. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్యే, సెటిలర్ ఎమ్మెల్యే అనే పదాలు పాపులర్ అయ్యాయి. ఈరోజు బీఆర్ఎస్ నుంచి చిట్టినాయుడు అనే డైలాగ్ బయటకొచ్చింది. ఇక కాంగ్రెస్ కూడా ఘాటుగానే బదులిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరైనా తిడితే నాలు కోస్తామంటూ ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను చెడ్డగొట్టాలని బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారాయన.

రేవంత్‌ను ఎవరైనా ఏమైనా అంటే సహించేది లేదన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్‌ కానీ, కేటీఆర్ కానీ.. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకు కోస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నేతలు లేనిపోని వివాదాలు సృష్టించి హైదరాబాద్‌ ప్రజల మూడ్‌ ఖరాబ్‌ చేశారని మండిపడ్డారు. గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వివాదం అని, దాన్ని కాంగ్రెస్ కి ఎందుకు అంటగడుతున్నారని ప్రశ్నించారు. ఓవైపు ప్రభుత్వం, అధికారులు వినాయక నిమజ్జనం సాఫీగా జరపాలని కష్టపడుతుంటే.. బీఆర్ఎస్ నేతలు అనవసర పంచాయతీలు పెట్టి ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని విమర్శించారు జగ్గారెడ్డి.

దానికి ఆద్యుడు కేసీఆరే..
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కొత్త పార్టీ కండువాలు కప్పే సాంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేదని గుర్తు చేశారు జగ్గారెడ్డి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త సాంప్రదాయానికి కేసీఆర్ తెరలేపారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఆయన గులాబీ కండువాలు కప్పారన్నారు. అప్పట్లో తమ పార్టీ నేతలు బీఆర్ఎస్ లోకి ఫిరాయించినప్పుడు.. ఇప్పుడు విమర్శిస్తున్న మేధావులు ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల్ని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయిన రోజే రాజకీయాల్లో విలువలు నశించాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...