YouTube channel subscription banner header

జానీ కేరాఫ్ చంచల్ గూడ జైల్..

Published on

జానీ మాస్టర్ ని చంచల్ గూడ జైలుకి పంపించారు పోలీసులు. గోవాలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 2 వారాల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకి తరలించారు. ఇక ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు వార్తలొచ్చాయి.

రిమాండ్ రిపోర్ట్ లో ఏముందంటే..?
2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడిందని, దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు అంటున్నారు. 2020లో ముంబయిలోని హోటల్‌లో ఆమెపై లైంగిక దాడి చేశాడని, అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు అని, ఆమె మైనర్ అని తేలింది. ఈ నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని కూడా పోలీసులు నిర్థారించారు. అయితే ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడని, తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని కూడా తేల్చారు. మరోవైపు జానీ మాస్టర్‌ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

అంతకు ముందు అత్తాపుర్ లోని ఆస్పత్రిలో జానీ మాస్టర్ కి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల సమయంలో మీడియా వీడియోలు తీస్తుంటే జానీ మాస్టర్ అడ్డుకున్నారు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, బయటకొచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తానని అన్నారు జానీ మాస్టర్.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...