YouTube channel subscription banner header

ఏ రైతుల గురించి మాట్లాడుతున్నారు.. రమణగారూ?

Published on

జస్టిస్‌ ఎన్వీ రమణ గురించి అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఆయన రిటైర్‌ అయ్యారు. ఆయన తాజాగా చేసిన ఓ ప్రకటన ముక్కు మీద వేలేసుకునే విధంగా ఉంది. ఆయనకు అమరావతి రైతులు, మహిళలు ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ తన అమూల్యమైన వాక్కులను వినిపించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాజధాని శంకుస్థాపనకు తాను కూడా వచ్చానని, రైతుకూ భూమికీ ఉన్న సంబంధం తల్లికీ బిడ్డకూ ఉన్న సంబంధం లాంటిదని, రైతు భూమిని కోల్పోవడం సామాన్యమైన విషయం కాదని, భూములు ఇచ్చి నేరస్థులుగా కోర్టులో నిలబడి కష్టాలు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని రైతులు న్యాయం చేయాలని ఆయన అన్నారు.

రాజధాని కోసం రైతులు త్యాగం చేశారని చెప్పిన ఆయన మాట నిజమే. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏ రైతుల గురించి అనేది ప్రశ్న. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రభుత్వం నిజమైన రైతుల నుంచి సారవంతమైన భూములను ఎలా స్వాధీనం చేసుకుంది, అందుకు రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరించింది అందరికీ తెలిసిన విషయమే. ఆ రైతుల భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయనేది ప్రధానమైన ప్రశ్న. ఏపీ రాజధాని ప్రాంతాన్ని అధికారికంగా ప్రకటన రాక ముందే అమరావతి ప్రాంతంలో ఏర్పాటవుతుందని తెలుసుకుని పెద్దలు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు.

చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అడ్వకేట్‌ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ బినామీదార్లు చాలా మంది భూములు కొనుగోలు చేశారని ఏసీబీకి అందిన ఫిర్యాదులో ఉంది. ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేస్తే దానిపై హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ పాస్‌ చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ వివరాలను బయటకు చెప్పవద్దనేది ఆ ఆర్డర్‌ ప్రధానాంశం. హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ను సుప్రీంకోర్టు తప్పు పడుతూ దాన్ని ఎత్తేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నిందితుల పేర్లు బయటకు వచ్చాయి. దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి కొనుగోలుదారులు క్రిమినల్‌ కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదైంది.

దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు 13 మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో జస్టిస్‌ ఎన్వీ రమణ ఇద్దరు కుమార్తెలు నూతలపాటి శ్రీతనూజ ప‌ద‌వ‌ ముద్దాయిగా, నూతలపాటి శ్రీభువన 11వ ముద్దాయిగా ఉన్నారు. ఈ విషయం జస్టిస్‌ రమణగారికి తెలియదా? ఆయన కళ్లు మూసుకుని ఉన్నారని అనుకోవాలా?

ఎన్వీ రమణ కుమార్తెలు రైతులు అవుతారా? నిజమైన రైతుల చేతుల్లోంచి భూములు ఎవరి చేతుల్లోకి, ఎటువంటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని అర్థం కావడం లేదా? అమరావతి రైతుల పేరిట ప్రస్తుతం చెలామణి అవుతున్నవారు నిజంగా రైతులేనా? కాదనే విషయం ఎన్వీ రమణగారి కుమార్తెల‌ భూములు కూడా ఉన్నాయనే విషయాన్ని బట్టి అర్థం కావడం లేదా? అమరావతి రైతుల పేరటి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నది ఎవరో రమణగారికి తెలియదా?

రైతులను భయపెట్టి అమరావతి ప్రాంతంలో అడ్డగోలుగా భూములు కొనుగోలు చేసి, ఇప్పుడు అమరావతి రైతులకు మేలు చేయాలని రమణగారు ప్రభుత్వాలను కోరడం ఏమిటి? రైతుకూ భూమికీ ఉన్న సంబంధం తల్లికీ బిడ్డకూ ఉన్న సంబంధం వంటిదనే విషయం నిజమైన రైతుల నుంచి భూములు లాక్కున్నప్పుడు ఆయనకు తెలియదా? రైతులు భూములు కోల్పోవడం సామాన్య విషయం కాదనేది ఆయనకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చిందా? సారవంతమైన రైతుల భూములను ఇష్టారాజ్యంగా సొంతం చేసుకున్న పెద్దలు ఇప్పుడు రైతులు అవుతారా? వీళ్లంతా రైతుల భూములను సొంతం చేసుకుంది సాగు చేయడానికేనా? కాదనే విషయం తెలిసిందే.

రైతుల నుంచి కొద్ది మంది పెద్దలు (ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు) సొంతం చేసుకున్నప్పుడు లేని కడుపు నొప్పి రమణగారికి ఇప్పుడే కలుగుతుందంటే, అదేమిటో అర్థం కావడం లేదా?

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...