YouTube channel subscription banner header

వివేకా హత్య.. చంద్రబాబు సహా ఎల్లో బ్యాచ్‌కు కోర్టు షాక్

Published on

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగిలింది. వివేకానంద రెడ్డి హత్యను వాడుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద, ఎంపీ అవినాష్ రెడ్డిపై ఊకదంపుడు ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చంద్రబాబు ప్లాన్ వేశారు. ఆ ప్లాన్‌కు కళ్లెం పడింది. వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరుపుతున్నందున ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేయవద్దని కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. నారా చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వైఎస్ షర్మిల, వివేకా కూతురు డాక్టర్ నర్రెడ్డి సునీత , దగ్గుబాటి పురంధేశ్వరి, బీటెక్ రవిలు వైఎస్ వివేకా హత్యకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏ విధమైన సంబంధం లేనప్పటికీ, అంటగడుతున్నారని ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు.

ఆ విధమైన ఆరోపణలు ప్రాథమిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న విచారణను ప్రభావితం చేయడం కూడా అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. హత్య చేసిన అవినాష్ రెడ్డిని వైఎస్ జగన్ కాపాడుతున్నారని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. కోర్టు పరిధిలోకి వెళ్లి ఎవరు కూడా వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదని కోర్టు అభిప్రాయపడింది.

కోర్టులో విచారణ జరుగుతుండగా ప్రజా కోర్టు పేరుతో రాజకీయ పార్టీలు, మీడియా జోక్యం చేసుకోవడం తగదని కోర్టు హెచ్చరించింది. నేరం రుజువు అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా అమాయకులు అనే విషయాన్ని గుర్తు చేసింది. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద, అవినాష్ రెడ్డి మీద ఉన్న అభ్యంతరకరమైన విషయాలను వెంటనే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏప్రిల్ 30వ తేదీ వరకు అమలులో ఉంటాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...