కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ గెలిచి ఉండేదన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావొచ్చని.. కానీ పదవులు మాత్రం ఇవ్వబోమన్నారు.
ఇక మరోసారి హరీష్‌రావును టార్గెట్ చేశారు రాజగోపాల్ రెడ్డి. హరీష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్‌రావు రియల్ పొలిటిషియన్ అంటూ మెచ్చుకున్నారు. కేసీఆర్‌కు నిజమైన రాజకీయ వారసుడు హరీష్‌రావు మాత్రమేనన్నారు రాజగోపాల్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు హరీష్‌రావుకు ఇవ్వాలన్నారు. కేటీఆర్ పొలిటిషియన్ కాదన్నారు రాజగోపాల్ రెడ్డి.
బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే రెండు పార్టీలు ఖతం అవుతాయన్నారు రాజగోపాల్ రెడ్డి. MIM పార్టీ కాంగ్రెస్‌తోనే ఉందని… అధికారంలో ఎవరుంటే వారితో ఆ పార్టీ ఉంటుందన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి వస్తే తీసుకునే ఛాన్సే లేదన్నారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు రాజగోపాల్ రెడ్డి.