ఇటీవల రాజమండ్రి సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కూటమిని గెలిపించాలని కోరారే తప్ప.. వారి గెలుపుతో ఏపీకి ఒరిగేదేమిటో చెప్పలేదు. రాష్ట్రానికి పలానా పనిచేస్తామని గానీ, పలానా వర్గాన్ని ఆదుకుంటామని గానీ ఆయన ప్రసంగంలో ఎక్కడా వినిపించలేదు. దీన్నిబట్టి ఏపీని ఎన్నికల రాజకీయానికి వాడుకోవడమే తప్ప.. రాష్ట్ర బాగోగులు మోదీకి పట్టవనేది సుస్పష్టం. గతంలో మోదీతో జతకట్టిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఇప్పుడు కొత్తగా చేసే అభివృద్ధి కూడా ఏమీ ఉండదని ప్రజలు గ్రహిస్తున్నారు.