YouTube channel subscription banner header

భారత్ లో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసు

Published on

కరోనా తర్వాత చాలా రకాల కొత్త వ్యాధుల గురించి ఆందోళనలు పెరిగాయి. కరోనా వైరస్ లోనే మ్యుటెంట్ లు వచ్చాయని, అవి మరింత ప్రమాదకరంగా ఉన్నాయనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అలాంటి కొత్త ఉపద్రవాలేవీ భారత్ ని పెద్దగా నష్టపరచలేదు. ఇటీవల మంకీపాక్స్ పై కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. ఇన్నాళ్లూ విదేశాల్లో మంకీపాక్స్ విరుచుకుపడిన ఉదాహరణలున్నాయి. తాజాగా భారత్ లో కూడా మంకీపాక్స్ ఎంటరైనట్టు అనుమానాలు మొదలయయ్యాయి. భారత్ లో తొలి మంకీపాక్స్ అనుమానిత కేసుని గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. గతంలో మంకీపాక్స్ అనుమానిత కేసులున్నా.. ఈ ఏడాది మార్చి తర్వాత మాత్రం ఒక్క కేసు కూడా వెలుగులోకి రాలేదు.

https://x.com/airnewsalerts/status/1832744195724829056

మంకీపాక్స్ ఉనికి ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఆ లక్షణాలను గుర్తించారు వైద్యులు. వెంటనే అధికారులకు సమాచారమిచ్చి అతడిని ఐసోలేషన్ లో ఉంచారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెబుతున్నారు. అయితే అతడి నుంచి ఇంకెవరికైనా ఆ వైరస్ సోకిందా, వారిలో కూడా మంకీపాక్స్ లక్షణాలు కనపడుతున్నాయా లేదా అనేది తేలాల్సి ఉంది. సదరు వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను మంకీపాక్స్ నిర్థారణకోసం ల్యాబ్ కి పంపించారు. ప్రైమరీ కాంటాక్ట్స్ పై అబ్జర్వేషన్ పెట్టారు. ఆ వైరస్ ఇంకా నిర్థారణ కాలేదు కానీ, లక్షణాలు మాత్రం అవే కాబట్టి కేంద్ర ప్రభుత్వం హడావిడి పడుతోంది. ఇన్నాళ్లూ మంకీపాక్స్ పై వినిపించినవన్నీ పుకార్లే, కానీ తొలిసారిగా అనుమానిత కేసు ఉన్నట్టు కేంద్రం ప్రకటించడంతో ఇటు ప్రజల్లో కూడా కలవరం మొదలైంది.

మంకీపాక్స్ ఆఫ్రికాలో ప్రబలంగా వ్యాప్తి చెందుతున్నట్టు ఆధారాలున్నాయి. బురుండి, రువాండా, ఉగాండా, కెన్యా వంటి 12 ఆఫ్రికన్ కంట్రీస్ లో మంకీపాక్స్ ఉంది. స్వీడన్, థాయిలాండ్ దేశాల్లో కూడా ఈ కేసులను గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 18వేల అనుమానిత కేసులుండగా, 926 మరణాలు సంభవించినట్టు తెలుస్తోంది. మంకీపాక్స్ తో విలవిల్లాడుతున్న ఆఫ్రికన్ దేశాలకు యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేస్తోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...