పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించింది తెలుగుదేశం. చంద్రబాబు ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక జనసేనాని సైతం ఓ చిత్తు కాగితంపై ఐదుగురు అభ్యర్థుల పేర్లు రాసి మీడియాకు చూపించారు. మిగిలిన 19 మంది అభ్యర్థుల పేర్లు రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు.
కానీ ఇప్పటికీ 10 రోజులు గడిచిపోయింది. తను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంపైనా ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు పవన్. ఇక జనసేన పోటీ చేయబోయే మిగిలిన 19 స్థానాలు ఏంటి.. అక్కడ అభ్యర్థులు ఎవరు అనే దానిపై అసలు పవన్ కల్యాణ్కైనా క్లారిటీ ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్టీ పెట్టి దాదాపు 10 ఏళ్లు అవుతున్నా.. కనీసం 24 స్థానాల్లో అభ్యర్థులను నిర్ణయించలేని పరిస్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారు. అంటే పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితం విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
మొన్నటివరకు సీరియస్గా నియోజకవర్గాల పర్యటనలు చేసిన పవన్ అన్న నాగబాబు సైతం ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఆయన సైతం పోటీ నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రాజమండ్రి రూరల్, గాజువాక సీట్లను టీడీపీకి త్యాగం చేసిన పవన్ కల్యాణ్.. మిగతా 19 సీట్లనైనా సొంత పార్టీ వాళ్లకు ఇస్తారా.. వాటిని త్యాగం చేసేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.