జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు లెక్కలతో ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సినీ నిర్మాతలు, సినీ నిర్మాణ సంస్థల వద్ద అడ్వాన్సులుగా తీసుకొన్న డబ్బును అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ అప్పులుగా చూపించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టేందుకే పవన్ ఇలా తన రెమ్యునరేషన్‌ని అప్పులుగా చూపించారనే చర్చ జరుగుతోంది.