ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పంలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఆయన కుప్పంలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వంద రూపాయలు ఇచ్చి ₹1000 తీసుకుని పద్ధతి రాదని తెలిపారు.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ అందిస్తామని అది కూడా ఒకటో తేదీనే లబ్ధిదారులకు చేరుతుందని చంద్రబాబు చెప్పారు. వృద్ధులకు మహిళలకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేస్తామని తెలిపారు.
ఇలా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలపై ప్రజలు స్పందిస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు ఇంటికి తీసుకువచ్చి పెన్షన్ ఇస్తున్నారు, మరి కొత్తగా చంద్రబాబు తీసుకువచ్చి ఇవ్వడం ఏంటి? ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎన్నో హామీలను ఇచ్చి ఏ ఒక్కటిని కూడా నెరవేర్చలేకపోయారని చంద్రబాబు చెప్పే ఈ మాటలపై తమకు నమ్మకం లేదంటూ ప్రజలు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.