టీడీపీ అధినేత చంద్రబాబు నైజం ఎలాంటిదో ఆంధ్ర ప్రజలకు బాగా తెలుసు. ఆయనకు అవసరమైతే ఎవరి పంచనైనా చేరతారు. అవసరం లేకపోతే.. తన వాళ్లను అయినా పక్కకు నెట్టేస్తారు. అయితే.. ఇప్పుడు ఆయన నైజం గురించి తెలుగు బోర్డర్ దాటేసింది. ఇతర రాష్ట్రాల వారు కూడా క్లిస్టర్ క్లియర్‌గా ఆయన బుద్ధిని బయటపెట్టేస్తున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుని చదివేసినట్లుగా ఆయన వ్యక్తిత్వాన్ని బయటపెట్టారు. పీకే చెప్పిన కామెంట్స్ నిజం అని నిరూపించేలా చంద్రబాబు కూడా ప్రస్తుతం ప్రవర్తిస్తుండటం విశేషం.
ఇంతకీ వియషం ఏమిటంటే…ప్రశాంత్ కిశోర్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో విలేఖరి ఆయనను చంద్రబాబు గురించి ఓ ప్రశ్న అడిగారు. ఒకప్పుడు చంద్రబాబు మిమ్మల్ని తిట్టారు కదా.. మరి ఆయనతో రీసెంట్గా మీరు ఎందుకు భేటీ అయ్యారు అని అడిగారు. దానికి పీకే.. తాను చంద్రబాబు కోసం పనిచేయటంలేదని స్పష్టంగా ప్రకటించారు. ఏ రాజకీయపార్టీకి కూడా తాను పనిచేయటంలేదని, తాను లైన్ మార్చుకున్నట్లు చెప్పినా వినకుండా చంద్రబాబు పదేపదే వెంటపడి లోకేష్‌ను పంపితే చివరకు వెళ్ళాల్సొచ్చిందన్నారు. అది కూడా చంద్రబాబుకు తనకు మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్ ఒత్తిడి వల్లే అని కూడా చెప్పారు.
చంద్రబాబు అందితే జట్టు.. అందకుంటే కాళ్లు పట్టుకునే రకం అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. సరిగ్గా ఆయన అలా చెప్పిన కొద్ది రోజులకే చంద్రబాబు అచ్చం ఆ మాటలు నిజం చేసేలా ప్రవర్తించడం గమనార్హం. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఎలాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నం. ఇందుకోసమే చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.
తాను అధికారంలో ఉన్నపుడు ఇదే అమిత్ కాన్వాయ్‌పై రాళ్ళేయించారు. అమిత్ షా పర్యటనలో బ్లాక్ బెలూన్లు ఎగరేయించారు. అసెంబ్లీలో, బయటా నరేంద్ర మోడీని నోటికొచ్చినట్లు మాట్లాడారు. భార్యను తరిమేశాడన్నారు, తల్లిని చూసుకోవటం కూడా చేతకాదన్నారు. కుటుంబాన్ని సరిగా చూసుకోలేని మోడీ ఇక దేశాన్ని ఏమి పాలిస్తాడంటూ ఏదేదో మాట్లాడారు. ఎప్పుడైతే అధికారం పోయిందో వెంటనే మోడీని కీర్తిస్తు స్తోత్రాలు మొదలుపెట్టేశారు. మోడీ ఒక దార్శినికుడని, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను పెంచాడంటు పొగుడుతున్నారు. అందుకనే ఇప్పుడు పీకే చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.