ఈనాడు రామోజీరావును భయం పట్టి పీడిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో బెదిరిపోయి వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే మరిన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన భయపడిపోతున్నారు. దాంతో జగన్ మీద కక్ష కట్టి తప్పుడు రాతలు రాస్తున్నారు. విదేశీ పెట్టుబడులపై ఆయన విషం చిమ్మారు. జగన్ పాలనలో రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం లేదని ఆయన తెగ బాధపడిపోతున్నారు. జగన్ మీద తప్పుడు రాతలు రాస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువును గంగలో కలపడానికి సిద్ధపడ్డారు.
గత ఐదేళ్ల కాలంలో జగన్ పాలనలో రూ.35 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్ అచ్యుతాపురం సెజ్‌లో దాదాపు రూ.1929 కోట్లతో భారీ టైర్ల తయారీ పరిశ్రమను స్థాపించి ఉత్పత్తి ప్రారంభించింది. జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద రూ.4,640 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.
యూరప్‌కు చెందిన పెట్రేగ్యాస్ కృష్ణపట్నం వద్ద రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లోటింగ్ ఎల్ఎన్‌జీ టెర్మినల్ ఇటీవల వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. జపాన్‌కు చెందిన డైకిన్ రూ.2,600 కోట్లతో ఏసీ తయారీ యూనిట్‌ను తిరుపతి జిల్లా శ్రీసిటీలో ప్రారంభించింది. అక్కడే టోరే ఫార్మా వేయి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. క్యాడ్ బరీస్ చాక్లెట్స్ మండలీజ్ రూ.1,600 కోట్లతో భారీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది.
ఆదిదాస్ బ్రాండ్ తో తయారయ్యే పాదరక్షల తయారీ సంస్థ హిల్ టాప్ సెజ్ పేరుతో రూ.800 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ త్వరలో ఉత్పత్తిని ప్రారంభించబోతోంది. విదేశీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం చాలా సమావేశాలు, డిప్లొమాటిక్ ఔట్ రీచ్‌లు ఏర్పాటు చేసింది.