టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఎన్ని దారుణాలు జరిగినా అవి రామోజీ కళ్లకు కనపడవు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు మూతపడేలా చేశాడు. నారాయణ, చైతన్య సంస్థలను బాగు చేయడం కోసం ఎన్ని ప్రభుత్వ బడులను మూతపడేలా చేసినా ఏనాడు రామోజీ స్పందించలేదు.
విద్య ప్రభుత్వ బాధ్యత కాదని తన బినామీ సంస్థలుగా ఉన్న నారాయణ, చైతన్య పాఠశాలలను పెంచి పోషించడానికి చంద్రబాబు(chandra babu) తన ప్రభుత్వ హయాంలో సాధారణంగా ఇవ్వాల్సిన నిధులును కూడా ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశాడు. ఈ విషయాలన్నీ రామోజీకి తెలిసినా ఏనాడు వాటి గురించి నోరు విప్పింది లేదు.
ఒకటి, రెండు తరగతుల్లో సరిపడా పిల్లలు లేక రాష్ట్రవ్యాప్తంగా 118 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయని ఈనాడు ఒక కట్టుకథను అల్లింది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 1,785 పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్ చంద్రబాబు హయాంలో మూతపడిన స్కూళ్లను కూడా తిరిగి తెరిపించారు. అంతేకాదు.. మనబడి నాడు-నేడు(mana badi nadu nedu) పథకం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌళిక సదుపాయాలు అందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రూ.17,805 కోట్ల వ్యయంతో, మూడు దశల్లో 12 మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో దాదాపు 32 వేల పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలపై జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 73,417 కోట్లు ఖర్చు చేసింది.