ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పిన రెండు సర్వేలకు విశ్వసనీయత లేదు. ఆ మధ్య సీ` ఓటర్ సంస్థ, ఇప్పుడు న్యూన్ 18 తమ సర్వేల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని తేల్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అత్యధిక సీట్లు వస్తాయని చెప్పాయి. అయితే, ఆ సంస్థల సర్వేలు ఫేక్ అనే విషయాన్ని చెప్పడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 2019 ఎన్నికల సమయంలో అన్ని సర్వేలకు విరుద్ధంగా సీ – ఓటర్, న్యూస్ 18 అంచనాలు ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుంది. ఆ సర్వేలు తేల్చిన ఫలితాలకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 శాసనసభా స్థానాలను, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది.
మరో విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అర డజనుకు పైగా సంస్థల సర్వేల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని తేలింది. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత టైమ్స్ నౌ – ఈటీజీ నిర్వహించిన సర్వేలో వైసీపీ 49 శాతం ఓట్లతో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని తేలింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 3 నుంచి 4 స్థానాలు వస్తాయని ఆ సర్వే స్పష్టం చేసింది.
వైసీపీ 48 శాతం ఓట్లతో 19 లోక్‌సభ స్థానాలను, 133 శాసనసభ స్థానాలను గెలుచుకుంటుందని జీ న్యూస్ – మారిటైజ్ సర్వే తేల్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 48 శాతం ఓట్లతో 42 శాసనభ స్థానాలకు, 6 లోక్‌సభ స్థానాలకు పరిమితమవుతుందని ఆ సర్వే తెలిపింది.
పొలిటికల్ క్రిటిక్ సర్వే ప్రకారం.. 49.5 శాతం ఓట్లతో వైసీపీ 121 శాసననసభా స్థానాలను, ఐదు అటూ ఇటుగా గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 43 శాతం ఓట్లతో 54 స్థానాల్లో, ఐదు అటూ ఇటుగా విజయం సాధిస్తుంది.
చాణక్య సర్వే ప్రకారం.. 49 శాతం ఓట్లతో వైసీపీ 17 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుంది. 44 శాతం ఓట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 8 లోక్‌సభ స్థానాలకు పరిమితమవుతుంది. జనాధార్ ఇండియా, జన్‌మత్ పోల్స్, పీపుల్స్ పల్స్ సర్వేలు కూడా కాస్తా అటూ ఇటుగా ఇదే విషయాన్ని చెప్పాయి.