ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికలు దగ్గరపడుతుంటే.. చంద్రబాబు చేసే చేష్టలు మాత్రం హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. నిన్నటి వరకు తిట్టిన నేతలతోనే ఆయన ఇప్పుడు స్నేహం మొదలుపెట్టడం విశేషం. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు ఆయన నానా తిప్పలు పడుతున్నారు. బీజేపీ పెద్దలతో సమావేశం కోసం ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో.. చంద్రబాబుపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది.
అంతేకాదు., ప్రస్తుతం చంద్రబాబుని మరో నితీశ్ కుమార్ అంటూ పోలుస్తుండటం విశేషం. ఎందుకో తెలుసా.. పాలిటిక్స్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూటర్న్ తీసుకోవడంలో అక్కడ నితీశ్ కుమార్ అయితే.. దక్షిణాదిన చంద్రబాబే అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఉత్తరాదిన నితీశ్ కుమార్ సైతం యూ టర్న్‌లకు మారుపేరుగా మారిపోయారు. సిద్ధాంతాలు లేకుండా ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవడంలో దిట్టగా పేరు పొందారు. ఇక దక్షిణాదిన అలాంటి నేత ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఫస్ట్ కనిపించేది చంద్రబాబే. మొదట్లో ఎన్డీఏ కూటమిలో కొనసాగిన చంద్రబాబు.. 2004లో ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు. 2014లో మళ్లీ ఎన్డీఏలో చేరారు. 2019కి ముందు మోడీ, అమిత్ షాలను తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు.
మొదట తెలుగుదేశం పార్టీ పుట్టిందే.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా… కానీ.. అలాంటి కాంగ్రెస్‌కే సపోర్ట్ ఇచ్చిన ఘనత చంద్రబాబుది కావడం విశేషం. కలిసి పోటీ చేయనప్పటికీ 2019 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు చంద్రబాబు. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అంటూ భుజాలకెత్తుకున్నారు. కానీ ఆయన అనుకున్నట్లు జరగకపోవడంతో.. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అయ్యారు.