YouTube channel subscription banner header

టీడీపీలో సీనియర్ల గరంగరం – పొత్తు ఎఫెక్ట్‌తో సీట్లు గల్లంతు

Published on

తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పొత్తులో భాగంగా అనేక సీట్లు జనసేన, టీడీపీకి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి కూడా ఈసారి సీట్లు దక్కే పరిస్థితి లేదు. దీంతో వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. జనసేన, బీజేపీ పొత్తులో టీడీపీకి సుమారు 75 సీట్లు పోతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది సీనియర్లకు సీటు దక్కని పరిస్థితి నెలకొంది. ఇంకోపక్క ఎవరికెన్ని సీట్లనేది ఇంకా ఖరారు కాకపోవడం.. మరోపక్క జనసేన అధినేత పవన్‌ పొత్తుతో సంబంధం లేకుండా వరుసగా సీట్లు ఖరారు చేసేస్తుండటం టీడీపీ నేతలకు షాకిస్తోంది.

గతంలో చంద్రబాబు ఏకపక్షంగా రెండు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేయగా, ఆ తర్వాత పవన్‌ కూడా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు పవన్‌ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పర్యటించి సీట్లు ఖరారు చేయడం టీడీపీ నేతలకు మింగుడు పడటంలేదు. సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించిన పవన్‌.. పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, భీమిలి, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు జనసేన నేతలు వెల్లడించారు. దీంతో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గాజువాక టీడీపీ ఇన్‌చార్జి పల్లా శ్రీనివాసరావు సీట్లు ఎగిరిపోయాయి. ఈ పరిణామంపై వారి వర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి.

దేవినేని ఉమా, గోరంట్ల బుచ్చయ్యలకు గట్టి షాక్‌
రాజమండ్రి రూరల్‌ స్థానంలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరికి కూడా ఈసారి సీటు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల రాజమండ్రి వచ్చిన పవన్ కల్యాణ్‌.. రాజమండ్రి రూరల్‌ స్థానాన్ని జనసేన నేత దుర్గేష్‌కి కేటాయించినట్టు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. దీంతో బుచ్చయ్యచౌదరి జనసేన నేతలపై బహిరంగంగానే మండిపడుతున్నారు. ఆ సీటు తనదేనంటూ పదేపదే చెబుతున్నారు. ఇక మైలవరంలో దేవినేని ఉమాకు గట్టి షాకే తగలనుంది. అక్కడ వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఆ పార్టీ సీటు ఇచ్చందుకు నిరాకరిస్తుండగా.. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు. మైలవరం స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుండటం ఉమా సీటుకు ఎసరు పెడుతోంది. దీంతో ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన తనను కాదని తన ప్రత్యర్థికి సీటు ఇవ్వడం ఏమిటని ఆయన మండిపడుతున్నారు.

ఆ కుటుంబాలకూ సీట్లలో కోత..
టీడీపీలో సీనియర్‌ నేతలుగా ఉన్న పరిటాల సునీత, జేసీ దివాకర్‌రెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబాలకు ఈసారి ఒక్క సీటు మాత్రమే ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్‌ ధర్మవరం స్థానం వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక జేసీ దివాకర్, ప్రభాకర్‌లలో ఒకరికే ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని సీటిస్తానని బాబు తేల్చేయడం గమనార్హం. అనకాపల్లిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికీ ఒక్క సీటే ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబాలన్నీ ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. మరోపక్క ఆళ్లగడ్డ సీటును మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఇచ్చేందుకు బాబు నిరాకరించడంతో ఆమె కూడా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తు పెడుతున్న చిచ్చు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది వేచిచూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...