గీతాంజలి ఆత్మహత్య ఉదంతంపై టీడీపీ మరింత నీచంగా వ్యవహరిస్తోంది. సంఘటనను పక్కదారి పట్టించడానికి ఎత్తులు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రశంసించినందుకు గీతాంజలిని టీడీపీ, జనసేన మనుషులు ఘోరంగా ట్రోల్ చేశారు. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అవమానాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటనపై ఇరు పార్టీలు చిక్కులను ఎదుర్కుంటున్నాయి. దీంతో కొత్త నాటకానికి తెర తీశాయి.
గీతాంజలి ఆత్మహత్యపై టీడీపీ, జనసేన నేతలు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. దానికితోడు, ఆ సంఘటనను వైసీపీ మీదికి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు గీతాంజలిని రైలు కిందికి తోసేశారని కొత్త డ్రామా ఆడుతున్నారు. ఓ వీడియోను కూడా పోస్టు చేసి వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఏ మాత్రం స్పష్టంగా లేదు. గీతాంజలిగా చెప్పుతున్న వీడియోలోని మహిళ ముఖం కనిపించడం లేదు. అది ఏ మాత్రం నమ్మడానికి వీలు లేకుండా ఉంది.
గీతాంజలిని ట్రోల్ చేసినవారిని, వారి వెనుక ఉన్న పార్టీలను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉద్వేగభరితమైన వీడియోను గీతాంజలి పోస్టు చేసినందుకు ఆమె ట్రోల్ చేశారని గుంటూరు ఎస్పీ తషార్ డూడీ అంటున్నారు. తాము కొన్ని మీడియా ప్రొఫైల్స్‌ను గుర్తించామని, వాటిలో కొన్ని అసలు ఖాతాలు, మరికొన్నిఫేక్ ఖాతాలు ఉన్నాయని ఆయన చెప్పారు.