ఏపీ సీఎం చంద్రబాబుని ప్రశ్నిస్తూ జగన్ వేసిన ట్వీట్ కి టీడీపీ ఘాటుగా స్పందించింది. వరదల్లో బురద రాజకీయం చేస్తున్న వైసీపీకి ఇవే మా సమాధాాలు అంటూ ట్వీట్ వేసింది. ప్రశ్నలు అడిగే సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారని కూడా ప్రశ్నించింది. తమరు ఈ ట్వీట్ బెంగుళూరులో ఉండి వేశారా ? లండన్ లో ఉండి వేశారా ? అంటూ కౌంటర్ ఇచ్చింది టీడీపీ. అంతే కాదు.. వరద బాధితులకు జగన్ ఇస్తానన్న కోటి రూపాయలు ఎప్పుడిస్తున్నారంటూ ప్రశ్నించింది.
https://x.com/JaiTDP/status/1832463414624436282
లెక్కలు ఇవీ..
ఒక్క రోజులోనే మూడు పూటలా 8 లక్షలమంది వరద బాధితులకు ఆహారం అందించామని టీడీపీ చెబుతోంది. ఇప్పటి వరకు 66,454 కుటుంబాలకి నిత్యావసర వస్తువుల కిట్లు పంపించామని స్పష్టం చేసింది. నిజమైన నాయకుడెవరైనా ఫలానా ప్రాంతంలో, ఫలానా చోట ఆహారం అందలేదని సద్విమర్శ చేసే వాడని, కానీ నీఛ రాజకీయాలు చేయడం జగన్ కి మాత్రమే సాధ్యమని.. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ బదులిచ్చింది.
విజయవాడలో 2 గంటల్లోనే 40 సెంటీమీటర్ల వర్షం పడి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చిందని, బెంగళూరులో ఉండే జగన్ కి ఇలాంటివి తెలిసే అవకాశం లేదని అంటున్నారు టీడీపీ నేతలు. గతంలో వైసీపీకి చెందిన ఇసుక మాఫియా కోసం, అన్నమ్మయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి, రాత్రికి రాత్రి 50 మందిని చంపేశారని, ఆ విషయం జగన్ కి గుర్తుందా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలోనే బుడమేరుకి గండిపడిందని, అయితే ఆ గట్టుపై మట్టి అమ్ముకుని వైసీపీ సొమ్ము చేసుకుందని బుడమేరు పేరుతో వైసీపీ నేతలు రూ.500కోట్లు వెనకేసుకున్నారని విమర్శించారు. కృష్ణానది ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు ఎప్పటి నుంచో తెరిచే ఉన్నాయని, అసలు జగన్ కి ఫ్లడ్ కుషన్ అంటే తెలుసా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
శుక్రవారం రాత్రి వర్షం పడితే, శనివారం ఉదయానికి అధికారులు ఫీల్డ్ లో ఉన్నారని టీడీపీ ట్వీట్ లో వివరణ ఇచ్చింది. NDRF, ఆర్మీ కూడా ఆ వరదలో వెళ్ళలేని ప్రతికూల పరిస్థితి ఉందని, అక్కడికి వాలంటీర్లు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. వేలాదిమంది ఉద్యోగులు గ్రౌండ్ లో ఏడు రోజులుగా పని చేస్తుంటే, జగన్ కి, ఆయన సాక్షికి అది కనిపించదా అని ట్విట్టర్లో ప్రశ్నించింది. వైసీపీ హయాంలో వరద సాయం అంటే ఒక టమోటా, ఒక బంగాళాదుంప ఇచ్చి సరిపెట్టారని, ఇప్పుడు తమ హయాంలో ఇస్తున్న వరద సాయం చూడాలని చెప్పింది. అయినా లండన్ లో స్థిరపడే జగన్ ఏపీ గురించి ఏపీ ప్రజల గురించి ఆలోచించలేరని బదులిచ్చింది టీడీపీ.