ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ విపరీతమైన అబద్దాలను ప్రచారం చేస్తోంది. నిజానికి ఈ డ్రాఫ్ట్ రూపొందించింది కేంద్రం. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు కేంద్రం దీన్ని అన్ని రాష్ట్రాలు అమలుచేయాలని సూచించింది కూడా. కానీ ఇదేదో వైసీపీ ప్రభుత్వమే తీసుకొచ్చినట్లు టీడీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అయినా.. ప్రస్తుతం ఏపీలో ఈ చట్టం అమలులో లేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు.