రేవంత్ సర్కార్ మరో వినూత్న ఆలోచన చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకునే దిశగా యోచిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. హోంగార్డుల తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో గౌరవం లభించేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఐతే ప్రస్తుతానికి ఆలోచన రూపంలోనే ఉన్న ఈ అంశం అమల్లోకి వస్తే రేవంత్ సర్కార్ కొత్త ఒరవడి సృష్టించినట్లవుతుంది.
ఇక సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్‌జెండర్ల వేధింపులు ఎక్కువవుతున్నాయన్న ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐతే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అమల్లోకి వస్తే వాహనదారుల నుంచి కూడా ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆసక్తిగా మారింది.