ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వం సిద్ధమవుతున్నారు. కాగా.. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలకు చంద్రబాబు చిత్తు అవ్వడం ఖాయమని తెలుస్తోంది. తాజాగా జగన్ నిర్వహించిన అనంతపురం జిల్లా రాప్తాడు(raptadu) భారీ బహిరంగసభ సూపర్ సక్సెస్‌తో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. రా.. కదలిరా.. అంటూ చంద్రబాబు పెట్టిన సభలకు జనాలు పెద్దగా రావటంలేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్న సిద్ధం(siddham) బహిరంగ సభలకు జనాలు విపరీతంగా హాజరవుతున్నారు.
జగన్ అయినా చంద్రబాబు సభలకైనా పార్టీ యంత్రాంగాలు ఇతర ప్రాంతాల నుండి జనాలను సమీకరించాల్సిందే అనటంలో సందేహంలేదు. కాకపోతే వీళ్ళిద్దరిలో ఎవరు అధికారంలో ఉంటే వారికి అధికార యంత్రాంగం సహకారం కూడా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జనాల్లో నమ్మకం లేకపోతే, ఆసక్తి లేకపోతే ఎంత ప్రయత్నించినా జనాలు సభలకు హాజరుకారు. ఈ విషయం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే బయటపడింది. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు దీక్షలు చేస్తే జనాలు పట్టించుకోలేదు.
అంతెందుకు విజయవాడ బెంజి సర్కిల్లో ట్రాఫిక్‌ను నిలిపేసి సభ పెట్టినా జనాలు పెద్దగా పట్టంచుకోలేదు. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అనేక బహిరంగ సభలు, రోడ్డు షోలు, ర్యాలీల్లో కూడా జనాలు పెద్దగా కనబడటంలేదు.
అదే జగన్ విషయం చూస్తే ప్రతిపక్షంలో కన్నా ఇప్పుడు నిర్వహిస్తున్న సభలకు జనాల సపోర్ట్ ఎక్కువగా ఉంది. మిగిలిన సభలను పక్కనపెట్టినా సిద్ధం ఎన్నికల ప్రచార సభలకు మాత్రం భారీగా తరలివస్తున్నారు. మొదటి రెండు సిద్ధం సభలకన్నా తాజాగా రాప్తాడులో జరిగిన బహిరంగసభ సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో చంద్రబాబు అండ్ కోలో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే ఎల్లో మీడియాలో బహిరంగసభకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా కనబడలేదు. పైగా జగన్‌కు వ్యతిరేకంగా బ్యానర్ కథనాలు రాసుకుంటున్నారు.
అంటే సిద్ధం బహిరంగసభకు సంబంధించిన ఫొటోలు, వార్తలు ఎల్లో మీడియా కవర్ చేయలేదంటేనే అర్థమైపోతోంది బహిరంగసభ ఎంతగా సక్సెస్ అయ్యిందో. జనాల స్పందన చూసిన తర్వాత మొత్తం ఎల్లోబ్యాచ్‌లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. చంద్రబాబు సభలకు ఉన్న ఊరిలో జనాలే హాజరుకావటంలేదు. అలాంటిది రాప్తాడు బహిరంగసభకు రాయలసీమలోని అన్నీ నియోజకవర్గాల నుండి పార్టీ శ్రేణులు, జనాలు హాజరవడం టీడీపీ నేతలకు చెమటలు పట్టిస్తోంది. సభకు జనాలు రావడం మాత్రమే కాదు.. జగన్ మాట్లాడినంత సేపు వారిలో ఉత్సాహం పెరిగిపోతోంది. వారి ఉత్సాహం టీడీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది.