తెలుగుదేశం కూటమిలో అసంతృప్తిలు చల్లారడం లేదు. టికెట్ దక్కని నేతలను బుజ్జగించలేక బాబు తలపట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడిగా పేరున్న బండారు సత్యనారాయణమూర్తి తనకు టికెట్ దక్కకపోవడంతో కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే బండారు సత్యనారాయణ విషయంలో బాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాడుగుల నుంచి బండారు పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.